
సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. ఈ వయసులో ఆయన నాలుగు సినిమాలను సెట్స్ పై ఉంచడం విశేషం. ఐతే, కరోనా వల్ల చిరంజీవి ప్లానింగ్ అంతా దెబ్బతింది. ఆయన అనుకున్న షెడ్యూల్ అంతా తారుమారు అయింది. ఇప్పుడు ఆయన ఒప్పుకున్న సినిమాలే ఆయనకి తలనొప్పి తెస్తున్నాయి.
‘ఆచార్య’ సినిమా 2020లో విడుదల కావాలి. కానీ ఫిబ్రవరి 2022లో రానుంది. ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అలాంటప్పుడు… చిరంజీవి ఒప్పుకున్న ఇతర సినిమాల విడుదల ప్లానింగ్ ఎలా?
‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీరయ్య’ ఇవన్నీ వరుసగా విడుదల కావాలి. ఇవి కాకుండా, దర్శకుడు వెంకీ కుడుములు డైరెక్షన్ లో ఇంకో సినిమా ఒప్పుకున్నారు. ఈ ఐదు సినిమాలను 2023లోపే విడుదల చెయ్యడం సానా కష్టం. చిరంజీవికున్న ఇంకో సమస్య ఏంటంటే… వాళ్ళ ఫ్యామిలీలోనే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్…. ఇలా ఇతర టాప్ హీరోలున్నారు. వాళ్ల సినిమాలకు, తన సినిమాల విడుదలలకు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
కాబట్టి మెగాస్టార్ కొంచెం దూకుడు తగ్గించాలి. ఎడా పెడా సినిమాలు లైన్ లో పెట్టొద్దు.