ముందు చిరు లేకుండా షూట్

Chiranjeevi


చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ రీమేక్ ని ఇప్పటికే లాంచ్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా వచ్చే నెలలో మొదలు కానుంది. ఐతే,చిరంజీవి మాత్రం ‘ఆచార్య’ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాతే పాల్గొంటారట. అప్పటివరకు, చిరంజీవితో సంబంధంలేని సీన్లను తీయాలని దర్శకుడు మోహన్ రాజా షెడ్యూల్ వేశారు.

‘లూసిఫర్’ రీమేక్ లో మిగతా క్యాస్టింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు చిరంజీవి, నయనతార, సత్యదేవ్ మాత్రమే సెట్ అయ్యారు. ఇంకా మూడు ప్రధాన పాత్రలకు ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో దర్శకుడికి కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఐతే, దానికి చిరంజీవి అప్రూవల్ కావాలి. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసి ఈ ఏడాదే విడుదల చెయ్యాలనుకుంటున్నారు. కానీ అది సాధ్యమేనా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటు ‘వేదాళం’ రీమేక్ కూడా ఉంది. అది ఏడాది చివర్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

More

Related Stories