భార్యపై చిరు సరదా కామెంట్

- Advertisement -
Chiranjeevi with wife Surekha

“నా భార్య చేయి వేయనివ్వడం లేదు…. “

ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా చిరంజీవి, తన భార్య సురేఖపై చేసిన కంప్లయింట్ ఇది. ఈమధ్య తన భార్యపై ప్రేమగా చేయి వేస్తుంటే.. ఆమె చేయి విదిలించుకొని దూరంగా వెళ్లిపోతోందని.. కరోనా ఇలా భార్యభర్తల మధ్య కూడా డిస్టెన్స్ తీసుకొచ్చిందని సరదాగా అన్నారు చిరంజీవి.

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు మెగాస్టార్. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన చిరు.. ఇలా సురేఖపై సరదాగా కామెంట్స్ చేశారు.

ఇదే మీటింగ్ లో మాట్లాడుతూ చిరంజీవి కూడా కొన్ని సార్లు దగ్గారు. ఆ టైమ్ లో తనపై తాను జోకులు వేసుకున్నారు. ఈ దగ్గు, ఆ దగ్గు కాదు.. మరోలా అర్థం చేసుకోవద్దు అంటూనే.. పక్కనున్న పోలీసాఫీసర్ తో మీరు కూడా నా నుంచి దూరంగా జరగుతున్నారా అంటూ పంచ్ వేశారు.

 

More

Related Stories