ఈ టైటిల్స్ నిజమేనా?


‘ఆచార్య’ విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మరో మూడు సినిమాలు లైనప్ చేశారు. అందులో ఒకటి లూసిఫర్ రీమేక్. మరోటి బాబీ డైరెక్షన్లో. ఇంకోటి మెహర్ రమేష్ దర్శకత్వంలో.

లూసిఫర్ రీమేక్ కి ‘రారాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ‘లూసిఫర్’ సినిమాలో క్రిస్టియానిటీకి చెందిన సూక్తులు, అంశాలుంటాయి. తెలుగులో ‘క్రైస్తవ మతం’ యాంగిల్ తీసేస్తున్నారట. అందుకే, ‘రారాజు’ అనే పాతకాలం అరిగిపోయిన టైటిల్ ని అనుకుంటున్నారనేది టాక్.

అలాగే, బాబి సినిమాకి ఇంకా ఏది సెట్ కాలేదు కానీ అప్పుడే ‘వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు మీడియా కథనాలు. మరి ఈ రెండు టైటిల్స్ నిజంగా ఫిక్స్ అయ్యాయా? ఇందులో నిజమెంతో అనేది చూడాలి.

More

Related Stories