- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి “ఆచార్య” సినిమాలో నటించనున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కానీ చరణ్, మెగాస్టార్ అభిమానులకు ఎప్పుడూ ఆనందాన్ని పంచుతూనే ఉంటారు. వీలున్నప్పుడల్లా తమ కాంబినేషన్ ఫోటోలను షేర్ చేస్తారు. తాజాగా, దీపావళి 2020 అకేషన్లో తమ సెల్ఫీని షేర్ చేశారు.
ఆకాశంలో బాణాసంచా పేలుతున్న బ్యాక్ డ్రాప్ లో తమ ఇంటి గార్డెన్ లో కలిసి సెల్ఫీ దిగారు మెగా డాడ్ అండ్ సన్.
“దివాలి నైట్ విత్ మై నైట్” (నా వీర సైనికుడితో దీపావళి రాత్రి) అని తన ఫోటోకి క్యాప్సన్ రాశారు చిరు. రామ్ చరణ్ కూడా సెల్ఫీని తన ఫోన్ లో బంధించేందుకు ప్రయత్నిస్తున్న ఫోటోని పోస్ట్ చేశాడు.