
ఆచార్య సినిమా విడుదలైంది. కానీ, సినిమాకి వచ్చిన నెగెటివ్ టాక్ చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని ప్రమోట్ చెయ్యాలా వద్దా అనేది ఇంకా తేల్చుకోలేక పోతున్నారట. మొదటి వారం కలెక్షన్లు చూసిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తారని చెప్పొచ్చు.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఒక పూర్తి స్థాయి సినిమా చెయ్యాలనేది అభిమానుల కోరిక. ‘ఆచార్య’ చిరంజీవి సురేఖ కోరిక. ఆమె పట్టుబట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ ని నటింపచేశారు. కానీ, ‘ఆచార్య’ మెగాభిమానులను మెప్పించలేకపోయింది.
వాల్తేర్ వీరయ్య అనేది పక్కా మసాలా చిత్రం. దర్శకుడు బాబీ తీస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి తాజాగా షూటింగ్ లో పాల్గొన్నారు.