80 శాతం వెనక్కి ఇచ్చేశాం: చిరంజీవి

Chiranjeevi and Ram Charan


‘ఆచార్య’ సినిమాకి తీసుకున్న పారితోషికంలో తాను 60 శాతం, తన కుమారుడు 100 శాతం తిరిగి ఇచ్చేసినట్లు చిరంజీవి వెల్లడించారు. ఇద్దరిదీ కలిపి మొత్తంగా 80 శాతం. సినిమా దారుణంగా పరాజయం పొందింది, కొన్నవాళ్ళు అందరూ నష్టపోయారు అని తెలిసిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా తాను, చరణ్ కలిసి తమ పారితోషికాల్లో 80 శాతం నిర్మాతకు ఇచ్చామని, కానీ ఈ విషయం ఎక్కడా ఇంతవరకు బయటికి రాలేదని అన్నారు.

“ఆచార్యలో నటించినందుకు బాధ పడడం లేదు. కొన్ని సార్లు మనం అనుకున్న ఫలితం రాదు. కానీ, నిర్మాత నష్టపోవద్దు అని తిరిగి ఇచ్చేశాం. మీకు డౌట్ ఉంటే నిర్మాతకు ఫోన్ చేసి అడగొచ్చు,” అని స్పష్టం చేశారు మెగాస్టార్.

సినిమా ఫ్లాప్ కాగానే ఎక్కువ దాని గురించి బాధ పడకుండా తాను, తన భార్య కలిసి అమెరికా వెళ్లి పలు ప్రదేశాలు తిరిగి వచ్చామన్నారు. అలా రిఫ్రెష్ అయి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్, రిషూటింగ్ చేశామన్నారు.

వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలు విడుదల అవుతాయని చెప్పారు. “ఆ తర్వాత కూడా సినిమాలు ఒప్పుకుంటా. ఎక్కువ రెస్ట్ తీసుకోవద్దు. పని చేస్తూనే ఉండాలి,” అనేది చిరంజీవి మాట.

 

More

Related Stories