చిరంజీవి దానాల వెనుకున్న రహస్యం

Chiranjeevi


మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు తన కుటుంబం, తన సంపాదన, తన ఆస్తుల పెంపు అన్నట్లుగా ఉండేవారు. గతంలో కూడా ఆయన ఛారిటీ చేసేవారు. పాతికేళ్ల క్రితమే బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఐతే, అప్పుడు ఇండస్ట్రీలో ఆయనకున్న ఇమేజ్ వేరు. ఇప్పుడు మొత్తం మారింది. మెగాస్టార్ ఇప్పుడు పూర్తిగా దాన, ధర్మాలపైనే ఫోకస్ పెట్టారు. అందుకే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఆయన్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు ఆయన జెన్యూన్ గా చేస్తున్న ఛారిటీ, సేవల గురించి మెచ్చుకుంటున్నారు.

మెగాస్టార్ ఇంతగా దానాలు చెయ్యడం వెనుక ఓ కారణం ఉంది. దాని గురించి ఇటీవల చిరంజీవి వివరించారు.

“ఎంతో స్టార్డం చూసిన గొప్ప గొప్ప నటులు, దర్శక, నిర్మాతలు తమ చివరి దశల్లో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చూశారు. ఎంత సంపాదించినా చివరికి ఏమి కూడబెట్టుకోలేకపోయారు. అందుకే, మా వారికి ఆస్తులు కూడబెట్టాలి అన్నట్లుగా ఉండేవాడిని మొదట్లో. ఇప్పుడు ఆ అవసరం లేదు. మా పిల్లలు అందరూ జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఇప్పుడు నేను కూడబెట్టాల్సింది ఏమి లేదు,” అని అసలు విషయం చెప్పారు.

ఇప్పుడు కోట్ల రూపాయల దానాలు చేస్తున్నారు చిరంజీవి. “ఇకపై నా జీవితం ఛారిటీకే అంకితం. ఎంతైనా దానం చేస్తాను. చేస్తున్న సినిమాల ద్వారా వస్తున్న డబ్బు కూడా ఛారిటీకే ఉపయోగిస్తున్నా.”

 

More

Related Stories