
మెగాస్టార్ చిరంజీవికి, కోల్ కోతా సిటీకి ప్రత్యేకమైన లింక్ ఉంది. ఆయన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి… చూడాలని ఉంది. ఈ సినిమా కలకత్తా (ఇప్పుడు ‘కోల్ కోతా’) నేపథ్యంగానే సాగింది. ఆ సినిమాలో వేటూరి కలకత్తా నగరం గురించి రాసిన ‘యమహా నగరి’ పాట ఎంతో పాపులర్. ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో కలకత్తా నగరం రెగ్యులర్ గా బ్యాక్డ్రాప్ గా కనిపిస్తూనే ఉంది.
మరోసారి చిరంజీవి ఈ సిటీ నేపథ్యంగానే మరో చిత్రం చేస్తున్నారు. ‘భోళా శంకర్’ సినిమా కథకి కోల్ కోతానే బ్యాక్ డ్రాప్.
హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన కోల్ కోతా సిటీ సెట్ లో చాలా భాగం చిత్రీకరించారు. ఐతే, ఇప్పుడు కొన్ని కీలకమైన సన్నివేశాల కోసం మెగాస్టార్ పశ్చిమ బెంగాల్ రాజధానికి వెళ్లారు. గురువారం (మే 4) నుంచి అక్కడ కొన్నిరోజుల పాటు షూటింగ్ జరుగుతుంది.
మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఆగస్టులో విడుదల కానుంది. చిరంజీవి సరసన తమన్న నటిస్తోంది. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ. తమిళంలో హిట్టయిన “వేదాలం” సినిమాకి రీమేక్.