
ఇటీవలే కరోనా కాలంలో మోహన్ బాబు, చిరంజీవి కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లారు. మినీ వెకేషన్ కి రెండు కుటుంబాలు వెళ్లి వచ్చాయి. అది జరిగి ఏడాది కూడా కాలేదు కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరిగింది. “మా” ఎన్నికల సమయంలో మోహన్ బాబు, మరో నటుడు నరేష్ తో అంటకాగి చేసిన రచ్చ చిరంజీవి మనసు విరిగేలా చేసిందట.
“మంచు”లకు పైపై ప్రేమలకు ఇక కరిగిపోకూడదని చిరంజీవి డిసైడ్ అయ్యారట. ఐతే, చిరంజీవి నిజంగా ఆ డెసిషన్ కి కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి. ఇప్పటికే మనోజ్ … పవన్ కళ్యాణ్ మూవీ సెట్ సెట్ కి వెళ్లి ఆయనని ‘ఆప్యాయంగా ఆలింగనం’ చేసుకున్నారు.
ఇవన్నీ ఎలా ఉన్నా… సినిమా ఇండస్ట్రీలో మాత్రం స్పష్టమైన చీలిక వచ్చింది. మెగాస్టార్ క్యాంప్ ఇకపై మోహన్ బాబు, నరేష్ లకు దూరంగా ఉండాలని అనుకుంటోంది. ముఖ్యంగా నరేష్ కి ఎంత దూరం జరిగితే అంత మంచిది అని చిరంజీవి అంటున్నారట.
ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవికి విష్ణు ఇన్విటేషన్ పంపలేదు.