ట్వీట్లో రవితేజపై చిరు పొగడ్త


మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ వచ్చేనెల 13న విడుదల కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఈ రోజు (డిసెంబర్ 27) మీడియాతో ముచ్చటిచ్చింది టీం. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కూడా మీడియా మీటింగ్ లో మాట్లాడారు. ఐతే, అన్ని విషయాలు మాట్లాడిన మెగాస్టార్ రవితేజ గురించి మాత్రం పెద్దగా చెప్పలేదు.

ఆ విషయం అయన తర్వాత తెలుసుకొని బాధపడ్డారు. వెంటనే రవితేజ గురించి తాను చెప్పాలనుకున్న విషయాన్నీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

చిరంజీవి ట్వీట్లో ఏమి చెప్పారో చదవండి.

“వాల్తేరు వీరయ్య టీం అందరితో, మీడియామిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈనాటి ప్రెస్‌ మీట్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా, టీం అందరూ ఎంతో సంతోషంగా, ఈ జర్నీ లో వాళ్ళ వాళ్ళమెమోరీస్‌ పంచుకోవటంతో … ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ అంత సంతృప్తి గా జరిగింది. అయితే నా వరకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంలో, చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు, రవితేజ గురించి చెప్పడం మర్పిపోయాను.

వచ్చేటప్పుడు అంతా ఈ విషయమై వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్‌ చేస్తున్నాను. ప్రాజెక్ట్‌ గురించి చెప్పగానే అన్నయ్య సినిమా లో చెయ్యాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి, కలసి షూట్‌ చేసిన ప్రతి రోజూ రవితో మళ్ళీ ఇన్నేళ్లకి చేయటం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా వుండేది. డైరెక్టర్‌ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌ లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది. ఆ విషయాలు త్వరలో మాట్లాడుకుందాం.”

 

More

Related Stories