చిరు-వెంకీ సినిమా ఉందా?

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ ప్రభావం, చిరంజీవి నటిస్తున్న మిగతా సినిమాలపై పడింది. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న గాడ్ ఫాదర్, బాబి సినిమా లాంటివి మినహాయిస్తే.. ఇంకా సెట్స్ పైకి రాని వెంకీ కుడుముల లాంటి సినిమాలపై ఆ  ప్రభావం గట్టిగా పడినట్టు కనిపిస్తోంది. ఆచార్య ఫ్లాప్ తో వెంకీ కుడుముల, మారుతి లాంటి దర్శకులతో చేయాల్సిన సినిమాల్ని చిరంజీవి హోల్డ్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

చిరు-వెంకీ కుడుముల సినిమాను ఆల్రెడీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చిరంజీవికి, వెంకీ కుడుముల ఆల్రెడీ లైన్ వినిపించాడు. ఇప్పుడీ ప్రాజెక్టుపై ఊహాగానాలు చెలరేగడంతో వెంకీ కుడుముల టీమ్ సభ్యులు రియాక్ట్ అవుతున్నారు. తమకు చిరంజీవి నుంచి ఎలాంటి సందేశం రాలేదని, ప్రస్తుతం తామంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నామంటున్నారు.

ఆచార్య రిలీజైన తర్వాత చిరంజీవి విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వెంకీ కుడుముల సినిమాపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు భోళాశంకర్, బాబి సినిమాల స్క్రీన్ ప్లేలో కూడా మార్పుచేర్పులు జరుగుతాయనే ప్రచారంపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

 

More

Related Stories