సాయి పల్లవితో స్టెప్స్ వెయ్యాలనుంది: చిరు

Sai Pallavi and Chiru


మెగాస్టార్ చిరంజీవి గొప్ప డ్యాన్సర్. చిరంజీవిలా గ్రేస్ తో డ్యాన్స్ చేసేవాళ్ళు అరుదు. మరి ఇంతకీ ఆయన ఎవరి డ్యాన్స్ కి ఫిదా అయ్యారో తెలుసా? సాయి పల్లవి స్టెప్స్ చూసి ఆశ్చర్యపోయారట. “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ విషయాన్ని బయటపెట్టారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహెర్ రమేష్ “భోళా శంకర్” అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో చెల్లెలు పాత్రకి మొదట సాయి పల్లవిని అడిగారు. కానీ ఆమె ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కీర్తి సురేష్ సైన్ చేసింది.

“సాయి పల్లవిని చెల్లెలు పాత్రకు అడుగుతున్నామని డైరెక్టర్ చెప్పినప్పుడు…. గో అహెడ్ అన్నాను. కానీ మనసులో మాత్రం ఆమె రిజెక్ట్ చెయ్యాలని అనుకున్నాను. ఆమె ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలీదు కానీ నాకు సంతోషం వేసింది. ఎందుకంటే… అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులు వేస్తె బాగుంటుంది కదా,” అని చిరంజీవి నవ్వులు పూయించారు.

సాయి పల్లవి కూడా వెంటనే స్పందించింది. రీమేక్ చిత్రాల్లో నటించడం తనకి భయమని అందుకే చెయ్యలేనని చెప్పాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని ఆమె వివరణ ఇచ్చింది. దానికి, చిరంజీవి కూడా స్పందించారు. “నువ్వు రిజెక్ట్ చెయ్యడం నేను ఏమి తప్పు పట్టడం లేదమ్మా… నీ డ్యాన్స్ అంటే అంత ఇష్టం.”

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన “ఫిదా” సినిమాలో మొదటి సారి సాయి పల్లవి చిరునవ్వు, ఆ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయాను అన్నారు చిరంజీవి.

Advertisement
 

More

Related Stories