బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మరీ

ఈ రోజు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు. ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చెయ్యడం లేదు బ్రహ్మి. కానీ, ఆయన ఒక లెజెండ్. ఒకప్పుడు ఆయన లేని సినిమా లేదు. ఇప్పుడు బ్రహ్మి లేకుండా సోషల్ మీడియా లేదు. మీమ్స్ అంటే బ్రహ్మి. ఎలాంటి సందర్భానికి ఐనా బ్రహ్మికి సంబంధించిన ఒక ఫోటో, వీడియో మీమ్ గా దొరుకుతుంది.

అందుకే, ఆయన సినిమాలు పెద్దగా చెయ్యకపోయినా… తెలుగువారి రోజువారీ చర్యల్లో మాత్రం దర్శనమిస్తున్నాడు మీమ్స్ రూపంలో.

ఇక ఈ రోజు బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి మరీ విషెష్ చెప్పారు. చిరంజీవి ఇటీవల సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ స్టేటస్ ఉన్న సెలెబ్రిటీలు దగ్గరికి వెళ్లి వారికి విషెష్ చెప్తున్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్న వారిని వెళ్లి పలకరిస్తున్నారు. అలా ఈ సారి బ్రహ్మి పుట్టిన రోజు నాడు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేయడం విశేషం.

ఇక బ్రహ్మానందం తాజాగా మూడు సినిమాలు ఒప్పుకున్నారు.

 

More

Related Stories