- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్రమోషన్ లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆయన ట్వీట్లు చాలా ఫన్నీగా, ట్రెండీ గా ఉంటున్నాయి. జనవరి 1కి లేదా సంక్రాంతికి “ఆచార్య” టీజర్ వస్తుందని మెగాభిమానులు ఊహించారు. వారి ఆశ నెరవేరలేదు. దాంతో, ఆ ప్రస్తావన తెస్తూ ఒక “మీమ్” రూపంలో పోస్ట్ పెట్టారు చిరంజీవి.
“ఏమయ్యా కొరటాల టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? డేట్ చెప్తావా లేదంటే నన్ను టీజర్ లీక్ చేయమంటావా?” అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.
ఈ నెల 29న టీజర్ రానుంది. దానికి బజ్ క్రేయేట్ చేస్తూ ఇలా మీమ్ పెట్టడం విశేషం. “ఆచార్య” సినిమాకి దర్శకుడు కొరటాల శివ. షూటింగ్ జోరుగా సాగుతోంది. మే నెలలో విడుదల కానుంది.
నేటి తరం హీరోలకన్నా ట్రెండీగా ఉన్నారు మెగాస్టార్.