గాడ్ ఫాదర్ డ్రాప్ అయ్యాడు!

Godfather


ప్రతి సినిమాకి మొదటి సోమవారం పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో పాస్ అయితేనే హిట్ వైపు వెళ్తుంది ఆ మూవీ. ఆ విషయంలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ పాస్ కాలేదు.

మొదటి ఐదు రోజులు మంచి కలెక్షన్లు చూపిన ‘గాడ్ ఫాదర్’ సోమవారం డ్రాప్ అయ్యాడు. ఆదివారం కలెక్షన్లలో దాదాపు 80 శాతం డ్రాప్ కనిపించింది. అంటే ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఆదివారం వచ్చిన కలెక్షన్లలో కేవలం 20 శాతం మాత్రం సోమవారం వచ్చాయి.

ఇంత కలెక్షన్లు తగ్గాక ఇది ఇక నిలబడడం కష్టమే. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని సంబరపడ్డ ఆనందం కేవలం ఐదు రోజులే నిలిచింది.

అలాగని సినిమా బాలేదు అని కాదు. కానీ, ఎందుకో ఈ సినిమాకి జనం భారీ ఎత్తున రాలేదు. అభిమానులు కూడా ‘తమకి కావాల్సిన’ మసాలా లేదని రిపీట్ గా చూడలేదు. దాంతో, దసరా సెలవులతోనే ఈ సినిమా హహ ముగిసింది.

‘ఆచార్య’ నుంచి మెగాస్టార్ సినిమాల బ్యాటింగ్ తగ్గింది. ఆ సినిమాతో పోల్చితే ఈ సినిమా కథ, కథనాల పరంగా చాలా అంటే చాలా బెటర్. కలెక్షన్ల పరంగా కూడా బెటర్. కాకపోతే, మెగాస్టార్ స్థాయి ఇమేజ్, పాపులారిటీకి తగ్గ కలెక్షన్లు రాలేదని నిష్ఠుర సత్యం. కొన్నిసార్లే అంతే.

 

More

Related Stories