చిరంజీవి ముద్దుపేరు ఇదే

- Advertisement -
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పద్మవిభూషణ్ చిరంజీవి. మొదట సుప్రీమ్ హీరో అయ్యారు. ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు. ఇప్పుడు పద్మవిభూషణ్ గౌరవం దక్కింది. ఐతే ఇండస్ట్రీలో హీరోలు, మిగతావాళ్లు చిరంజీవిని అన్నయ్య అని పిలుస్తారు. మరికొందరు బాస్ అంటారు.

కానీ వాళ్ల ఆయనకు ఓకే ముద్దు పేరు ఉంది. తల్లి అంజనాదేవి శంకర్ బాబు అంటుంది. మరి చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్,

చిరంజీవి పూర్తిపేరు కొణెదల శివశంకర వరప్రసాద్. అంతపెద్ద పేరు పిలవలేక కేఎస్ఎస్వీ ప్రసాద్ అని పిలిచేవారట ఆయన స్నేహితులు. కొన్నాళ్లకు ఆ ప్రసాద్ అనేది కూడా పోయింది. కేఎస్ఎస్వీ అని పిలిచేవారు. మరికొన్నాళ్లకు ఫ్లోలో అదే పేరు కేఎస్వీగా మారిపోయింది. ఇదే ఆయన ముద్దుపేరు.

ఇక అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటి వారు చిరంజీవిని కెఎస్ అని పిలుస్తారట.

 

More

Related Stories