
ప్రముఖ కూచిపూడి కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు అకాల మరణంపై చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. శోభానాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి.. ఆమెతో తన ఆఖరి సంభాషణను నెమరువేసుకున్నారు.
“ఈమధ్య కరోనాపై శోభానాయుడు చేసిన నృత్యగేయం నేను చూశాను.శారీరకంగా ఇబ్బంది ఉన్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా ఆమె నాట్యం చేశారు. కళ పట్ల, సమాజం పట్ల ఆమెకున్న అభిమానం నాకు అర్థమైంది. నా ప్రశంసల్ని సంగీత దర్శకుడు కోటి ద్వారా ఆమెకు పంపించాను. ఆ తర్వాత ఆమె నాకు ఓ వాయిస్ మెసేజ్ పంపించారు. కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత చేయబోయే ఓ ప్రదర్శనకు నన్ను ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని ఆమెకు చెప్పాను. అంతలోనే శోభానాయుడు మనముందు లేకపోవడం దురదృష్టం.”
ఇలా శోభానాయుడితో జరిగిన ఆఖరి సంభాషణను చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ప్రజల్ని తన కళతో చైతన్యం చేయడం కోసం శోభానాయుడు చాలా కష్టపడ్డారని, అలాంటి వ్యక్తి మళ్లీ పుట్టరని అన్నారు చిరు.