పెళ్ళికి, సినిమాకి లింక్ ఏంటి?

Sujeeth weds Pravallika

“లూసీఫర్” రీమేక్ బాధ్యతని మెగాస్టార్ చిరంజీవి మొదట సుజీత్ కి అప్పచెప్పారు. సుజీత్ తనకి తెలిసిన స్టయిల్లో కథను మార్చాడు. దర్శకుడు సుజీత్ చేసిన మార్పులు, చేర్పులు చిరంజీవికి నచ్చలేదు. ఇది వాస్తవం.

ఐతే, మెగాస్టార్ తాజాగా ఇచ్చిన వివరణ విడ్డూరంగా ఉంది. సుజీత్ ని ఎందుకు తొలగించారని అడిగితే, మెగాస్టార్ ఇచ్చిన సమాధానం ఎలా ఉందో చూడండి. “సుజీత్ ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. సో… నేను ఈ ప్రాజెక్ట్ పై పూర్తిగా కాన్ సెంట్రేట్ చేయలేకపోతున్నాను అని సుజీత్ వచ్చి చెప్పాడు. సినిమా బాధ్యతల నుంచి తప్పించండి అని కోరాడు. నేను దానికి ఒప్పుకున్నాను. ఆ మూవీని ఇప్పుడు వినాయక్ కి అప్పచెప్పాం,” అని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

పెళ్ళి చేసుకోవడానికి, ఈ సినిమాపై దృష్టి పెట్టలేకపోవడానికి చెప్పిన కారణం ఎక్కడైనా అతికేలా ఉందా? లూసిఫర్ రీమేక్ వచ్చే ఏడాది ఎప్పుడో మొదలయ్యే ప్రాజెక్ట్. అంటే… సుజీత్ తన భార్యతో కలిసి నాలుగు ఐదు సార్లు ఈజీగా హనీమూన్ ట్రిప్పులు వేసేంత గ్యాప్ ఉంది. మరి అలాంటప్పుడు సుజీత్ ఎందుకు వదులుకుంటాడు చెప్పండి?

సుజీత్ చేసిన స్క్రిప్ట్ నచ్చలేదని బహిరంగంగా చెప్పలేక చిరంజీవి ఇలా మర్యాదపూర్వకంగా చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ కుర్ర దర్శకుడిని ఆలా కవర్ చేసే ప్రయత్నం చేశారు.

Related Stories