సమంతకి చిట్టిబాబు కౌంటర్!

Samantha

సమంత వర్సెస్ చిట్టిబాబు

చిట్టిబాబు దెప్పిపొడిస్తే సమంత ఇచ్చిపడేసింది. సమంత వదిలిన కౌంటర్ కి చిట్టిబాబు స్ట్రాంగ్ రియాక్షన్… ఇది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ.

“శాకుంతలం” సినిమా అట్టర్ ఫ్లాప్ కాగానే చిట్టిబాబు సమంత పని అయిపోయింది అని కామెంట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా తన ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఒక పోస్ట్ పెట్టింది. “చెవుల్లో వెంట్రుకలు పెరగడానికి కారణం ఏంటి?” అని గూగుల్ లో సెర్చ్ చేసిన పేజీ స్కీన్ షాట్ తీసి సమంత పెట్టింది. బుచ్చిబాబు చెవులకు మొత్తం వెంట్రుకలే. సో ఆమె అలా అతన్ని బాడీ షేమింగ్ చేసింది.

ఇప్పుడు బుచ్చిబాబు కౌంటర్ ఇచ్చారు సమంతకి. “సమంత గురించి నేను సరిగ్గా మాట్లాడితే ఆమెకి తల ఎక్క డ పెట్టుకోవాలో కూడా తెలియదు,” అని సమాధానం ఇచ్చారు.

ఇంతకీ చిట్టిబాబుకి సమంత మీద ఎందుకు కోపం? ఆయన ఒక చిన్నస్థాయి నిర్మాత. ఇప్పుడు విశ్లేషకుడి అవతారం ఎత్తారు. పుట్టగొడుగుల్లా వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ ఎదో ఒకటి మాట్లాడే జర్నలిస్టులు, నిర్మాత, దర్శకులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాయి. హీరోల, హీరోయిన్ల బెడ్ రూమ్ లోకి వీళ్ళు వెళ్లినాట్లు బిల్డప్ ఇస్తూ ఏవేవో చెప్తుంటారు. అలాంటి బ్యాచ్ లో ఒకరు ఈ చిట్టిబాబు.

అతనికి సమంతపై వ్యక్తిగత కోపం లేదు. యూట్యూబ్ లో పాపులారిటీ కోసం, ఆ ఛానెల్స్ కి మంచి స్పైసి థంబ్ నెయిల్ కి పనికొచ్చే మాటలు వాగాలి. ఆ పని చిట్టిబాబు చేశారు.

Advertisement
 

More

Related Stories