‘చోర్ బజార్’కి డేట్ ఫిక్స్

Chor Bazaar

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రానికి విడుదల తేదీ ఖరారు అయింది. ఈ సినిమాలో గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమకి సంబందించిన పనులు అన్ని పూర్తి అయ్యాయి. ఈనెల 24న విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాతలు తెలిపారు.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటంతో బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది. ఆకాష్ పూరి ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. పూరి కుమారుడు ఆకాష్. ఈ కుర్ర హీరో ఇప్పటికే ‘మెహబూబా’, ‘రొమాంటిక్’ చిత్రాల్లో నటించాడు.

 

More

Related Stories