సినిమాటోగ్రాఫర్ రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత

Rajendraprasad

ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ ఆయన సోదరుడు.

‘నిరంతరం’ (1995) అనే చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ దర్శక, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. కైరో చలన చిత్రోత్సవానికి ఆ చిత్రం ఎంపిక అయ్యింది. ‘మన్ విమన్ అండ్ ది మౌస్’, ‘రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్’, ‘ఆల్ లైట్స్, నో స్టార్స్’ వంటి అంతర్జాతీయ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా సేవలు అందించారు. హిందీ సినిమాలు కూడా చేశారు.

 

More

Related Stories