
ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు నీలకంఠ. “షో”, “మిస్సమ్మ” వంటి సినిమాలు తీసిన ఆయన చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలంగా సరైన విజయం లేకపోవడంతో ఆయనకి గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆయన కొత్త చిత్రం.. “సర్కిల్”. తాజాగా టీం టీజర్ ను విడుదల చేసింది. “జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా హీరో పాత్ర ఒక సర్కిల్లోకి నెట్టబడుతాడు. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. అతను ఆ వలయం నుంచి ఎలా బయటికి వస్తాడు అనేది మెయిన్ కథ,” అని చెప్పారు నీలకంఠ.
సాయి రోనక్ హీరోగా నటించారు. శరత్ చంద్ర నిర్మించారు. బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై, నైనా ఇతర రోల్స్ చేశారు.
మరి ఈ సినిమాతోనైనా నీలకంఠ అపజయాల సర్కిల్ నుంచి విజయాల సర్కిల్ లోకి నెట్టబడుతారా?