ఆచార్య రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్లే

Ram Charan as Siddha

“ఆచార్య” విడుదల తేదీపై ఉన్న డౌట్స్ అన్ని తొలిగిపోయినట్లే. మే మొదటివారంలో విడుదల చెయ్యాలనేది “ఆచార్య” టీం ప్లాన్. ఐతే, “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ లో స్టక్ అయిపోయిన రామ్ చరణ్ “ఆచార్య” సెట్ కి ఎప్పుడు వస్తాడు అనే విషయంలో మొన్నటివరకు క్లారిటీ లేక దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి టెన్షన్ పడ్డారు.

కానీ, రామ్ చరణ్ రాజమౌళి నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ రోజు నుంచి షూటింగ్ లో పాల్గొన్నాడు. రామ్ చరణ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడు. వెంటనే “ఆచార్య”కి డేట్స్ ఇచ్చాడు. మార్చిలోపు రామ్ చరణ్ ప్రతి నెలా కొన్ని రోజులు “ఆచార్య”కి డేట్స్ ఇస్తాడు. ఈ మూడు నెలల్లో రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ భాగం అంతా పూర్తి చేసేలా ప్లాన్ రెడీగా ఉందట. మధ్యమధ్యలో రామ్ చరణ్ తన “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ లోనూ పాల్గొంటాడు.

రెండు సినిమాల గెటప్ ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్. మళ్ళీ … ఏ అడ్డంకి రాకపోతే “ఆచార్య” అనుకున్న డేట్ కి విడుదల అవుతుంది. మేలో మెగా పండుగే.

More

Related Stories