
కరోనా తర్వాత చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఎంత పెద్ద సినిమానైనా ఓటీటీలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. పైగా పెద్ద సినిమాలు కూడా మినిమం గ్యాప్ లో ఓటీటీలోకి వచ్చేస్తుండడంతో కొంతమంది ఆడియన్స్ థియేటర్లను స్కిప్ చేశారు. అలా ఎఫ్3 విడుదల కోసం కూడా ఎదురు చూస్తున్నారు.
ఇలా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఎఫ్3 యూనిట్ షాకిచ్చింది. ఆచార్య, రాధేశ్యామ్ టైపులో ఎఫ్3 సినిమా తొందరగా ఓటీటీలోకి రాదని స్పష్టం చేశారు. ఈ మేరకు వెంకీ, వరుణ్, రావిపూడి ఓ వీడియో రిలీజ్ చేశారు.

“ఎఫ్ 3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ థాంక్యూ. ఎఫ్3ని థియేటర్ లో చూడకపోయినా నాలుగు వారాల్లో ఓటీటీకి వస్తుందని అనుకున్నారు కదా.. ఇట్స్ నాట్ కమ్మింగమ్మా .. నాలుగు వారాల్లో రాదమ్మా..ఎనిమిది వారల తర్వాతే వస్తుందమ్మా .. రెండు నెలల తర్వాత ఓటీటీకి వస్తుంది., సో అందరూ థియేటర్ కే వచ్చి ఎఫ్ 3ని చూసి ఈ సమ్మర్ లో సరదాగా నవ్వుకోండి”
ఇలా 2 నెలల వరకు ఈ సినిమా ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సోనీ లివ్ సంస్థ దక్కించుకుంది. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన నెల రోజుల గ్యాప్ లో జీ తెలుగు ఛానెల్ లో ఎఫ్3 సినిమా ప్రసారం అవుతుంది.