ప్రభాస్ సినిమాకు క్లైమాక్సే కీ

Radhe Shyam

ప్రభాస్ కు ప్రేమకథలు కొత్తకాదు. కెరీర్ స్టార్టింగ్ లో చాలా లవ్ స్టోరీస్ చేశాడు. బాహుబలి ముందు వరకు చేస్తూనే ఉన్నాడు. మరి అలాంటి హీరో ”రాధేశ్యామ్” అనే ప్రేమ కథను ఎలా అంగీకరించాడు? ప్రభాస్ ఓకే చెప్పేంత బలమైన పాయింట్ ఇందులో ఏముంది? పైగా పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ ఇలాంటి కథకు ఓకే చెప్పాడంటే కచ్చితంగా అందులో విషయం ఏదో ఉందనే అనుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇప్పుడీ ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఓ ఇంట్రెస్టింగ్ ప్రచారం రౌండ్స్ కొడుతోంది. ”రాధేశ్యామ్” సినిమాకు క్లైమాక్సే ప్రాణం అనేది వాటి సారాంశం. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరోహీరోయిన్లు చనిపోతారట. అందుకే తాజాగా రిలీజైన మోషన్ టీజర్ లో అమర ప్రేమికుల్ని చూపించారని అంటున్నారు.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ సినిమాలో హీరోహీరోయిన్లు చనిపోయినట్టు చూపించినప్పటికీ అది సుఖాంతమే అవుతుంది. అదెలా అంటే.. స్టోరీలైన్ అలాంటిది. జ్యోతిష్యం, సైన్స్ కు ముడిపెడుతూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. క్లైమాక్స్ కు వచ్చేసరికి కథ ప్రకారం హీరోహీరోయిన్ పాత్రలు చనిపోతాయట, అదే టైమ్ లో మళ్లీ బతుకుతాయట.ఇదే ట్విస్ట్.

ఈ క్లైమాక్స్ నచ్చే ”రాధేశ్యామ్” చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నట్టు చెబుతున్నారు కొంతమంది. మరి ఈ సినిమాకు క్లైమాక్స్ ఎంత కలిసొస్తుందో చూడాలి.

Related Stories