- Advertisement -

కొంతకాలంగా విక్రమ్ కి వింత వింత గెటప్పుల్లో కనిపించడం అనే పిచ్చి పట్టుకొంది. నటుడిగా రకరకాల విన్యాసాల మీదున్న మోజులో కథల గురించి పట్టించుకోవడం మానేశాడు. అదే అతని కెరీర్ ని కష్టాల్లో పడేసింది. తాజాగా వచ్చిన “కోబ్రా” టీజర్లో కూడా అదే పంథా.
“కోబ్రా” సినిమాలో విక్రమ్ ఒక మ్యాథమెటిషన్ గా యాక్ట్ చేస్తున్నాడు. కానీ లెక్కల మాస్టర్ పాత్రలోనూ వింత వింత గెటప్పులకే ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో విక్రమ్ కి ఇంకా వీటిపై మోజు పోలేదని విమర్శలు పడుతున్నాయి.
“కథ, కథనాలు మీద దృష్టి పెట్టకుండా… ఇలాంటి వాటిని పట్టించుకోవడం ఏంటి” అని చియాన్ విక్రమ్ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ హిట్ చాలా కాలం అవుతోంది.