సోమవారం తర్వాత డ్రాప్!

30 Rojullo Preminchadam Ela

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకి రివ్యూస్, టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు కలెక్షన్లు వచ్చాయి. ప్రదీప్ మాచిరాజుకి టీవీ స్టార్ గా ఉన్న పాపులారిటీ, ‘నీలి నీలి ఆకాశం’ అనే వైరల్ పాట ఈ సినిమాకి సూపర్ ఓపెనింగ్స్ తెచ్చాయి. ఈ మూడు రోజుల కలెక్షన్లు చూసి సినిమా సూపర్ హిట్ అని ట్రేడ్ పండితులు తేల్చారు.

ఐతే, సోమవారం నుంచి అన్ని సినిమాల కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ‘క్రాక్’, ’30 రోజుల్లో’ సినిమా కలెక్షన్లు మంగళవారం, బుధవారం మరింతగా పడిపోయాయి. ఇంకా చెప్పాలంటే… ఇప్పుడు మరి జీరో రేంజులోకి వచ్చాయి కలెక్షన్లు. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలపై ఫోకస్ ఉంది.

మరి ’30 రోజుల్లో’ సినిమా హిట్టా? ఈ సినిమా మూడు కోట్లలో తీసి ఉంటే హిట్ అని చెప్పొచ్చు. కానీ ప్రొడ్యూసర్ తన సినిమాకి ఆరున్నర కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. నిజంగా అన్ని కోట్లు అయి ఉంటే …ఇది లాస్ ప్రాజెక్ట్. ఎందుకంటే.. ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోలేదు. ఒకవేళ ఇప్పుడు డీల్ క్లోజ్ చేసినా… రెండు కలిపి మూడు కోట్లకి మించి రావు. అలాంటప్పుడు ఇది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అనలేం.

More

Related Stories