రెండో ఇన్నింగ్స్ లో రెండు

Colors Swathi


కలర్స్ స్వాతి మరోసారి నటిగా బిజీ అవుతోంది. నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. భర్తతో కలిసి విదేశాల్లో కాపురం పెట్టింది. ఐతే, రెండేళ్ల క్రితం ఆమె ఇండియాకి తిరిగొచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉంటోంది. దాంతో, ఆమె మళ్ళీ వరుసగా సినిమాలు ఒప్పుకొంటోంది.

ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె పూర్తి చేసిన మొదటి చిత్రం… ‘పంచతంత్రం’. ఇది త్వరలోనే విడుదల కానుంది. తాజాగా చిత్రం సైన్ చేసింది. ‘ఇడియట్స్‌’ అనే పేరుతో స్వాతి, ఇతర నటీనటులతో రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్‌ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది.

కలర్స్ స్వాతి ఇంకా ఎక్కువ సినిమాలు ఒప్పుకోవాలని అనుకొంటోంది. ఐతే, తనకి కంఫర్ట్ గా ఉండే పాత్రలే చేస్తుందట.

 

More

Related Stories