
కమెడియన్ పృథ్వీరాజ్ ఎటూ కాకుండా అయిపోయాడా అనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం అతని హహ నడిచింది. వరుస సినిమాలతో బాగా సంపాదించుకున్నారు. ఐతే, వైఎస్సార్సీపీ మోజులో ఆయన పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అంతేకాదు, నమ్ముకున్న పార్టీ ఒక పదవి ఇస్తే అది మూణ్ణాళ్ళ ముచ్చటగా మిగిలింది.
ఇపుడు జగన్ పార్టీలో గుర్తింపు లేదు. రాజకీయంగా జీరో అయ్యారిప్పుడు. ఇక సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు పృథ్వీ
“మా పార్టీ చెప్పింది పవన్ కళ్యాణ్ ని తిట్టాలని. దాంతో, నేను ఎక్కువ రెచ్చిపోయాను. పవన్ కళ్యాణ్ ని తప్ప నేను చిరంజీవి గారిని కానీ మెగా హీరోలను ఎవరినీ విమర్శించలేదు. కేవలం పార్టీ కారణంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాను. కానీ, నేను అతి చేసి ఉండాల్సింది కాదు,” అన్న అర్థంలో పృథ్వీ మాట్లాడుతున్నారు.
ఐతే, పృథ్వీకి మళ్ళీ దశ తిరుగుతుందా అనేది చెప్పడం కష్టమే. ఇప్పుడు కామెడీ పంథా మారింది తెలుగు సినిమాల్లో. కొత్తతరం కమెడియన్లు వచ్చారు. పృథ్వీ తరహా కామెడీకి కాలం చెల్లింది.