జబర్దస్త్ కామెడీ స్టార్స్ తో చెక్

జబర్దస్త్ కామెడీ స్టార్స్ తో చెక్

ఇప్పటివరకు ఏ కామెడీ షో కూడా “జబర్దస్త్” కార్యక్రమానికి పోటీ ఇవ్వలేకపోయింది. టీవీల్లో కామెడీ షో అంటే …’జబర్దస్త్’ అన్నట్లుగా జనంలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అందుకే, జీటీవీ నాగబాబుతో చేసిన కామెడీ షో ఫలించలేదు. ఇంకా పలు ఛానెల్స్ చేసిన ప్రయోగాలు అన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. కానీ ‘స్టార్ మా’ ఛానెల్ ఎట్టకేలకు సక్సెస్ అయింది.

ఇంతకుముందు ఇదే ఛానల్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఐతే, లేటెస్ట్ గా “కామెడీ స్టార్స్” పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసి …. జబర్దస్త్ కి చెక్ పెట్టింది. గత ఆదివారం ప్రసారం అయింది కామెడీ స్టార్స్ మొదటి ఎపిసోడ్. ‘జబర్దస్త్’ నుంచి బయటికొచ్చి ‘బిగ్ బాస్’లో పాల్గొని మంచి పాపులరయిన ‘అవినాష్’ మెయిన్ యాక్టర్ గా ‘కామెడీ స్టార్స్’ని రూపొందించారు. ఈ మొదటి షోకి 9 పాయింట్ల రేటింగ్ వచ్చింది.

‘జబర్దస్త్’కి గతవారం 7 పాయింట్ల రేటింగ్ రాగా, “కామెడీ స్టార్స్”కి ఏకంగా 9 పాయింట్ల రేటింగ్ రావడం విశేషం. ఫస్ట్ ఎపిసోడ్ తో ఐతే అవినాష్ సక్సెస్ అయ్యాడు.ఆ తర్వాత ఇదే ఊపు మైంటైన్ చేసి ‘జబర్దస్త్’కి చెక్ పెడుతారా అన్నది చూడాలి.

More

Related Stories