‘పుష్ప’ మరో ‘కేజీఎఫ్’ అవుతుందా?

Pushpa and KGF

”పుష్ప” సినిమాపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. సూపర్ హిట్టయిన ”కేజీఎఫ్”తో “పుష్ప”కు లింక్ పెడుతూ స్టోరీలు అల్లేస్తున్నారు సోషల్ మీడియా జనం. ‘కేజీఎఫ్’లో హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో.. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ‘పుష్ప’లో హీరోయిజం ఉంటుందట.

సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం.. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ అనే వ్యక్తి ఓ సాధారణ కూలీ స్థాయి నుంచి స్మగ్లర్ గా ఎదుగుతాడట. ఈ పాయింట్ ను పట్టుకొని ‘కేజీఎఫ్’కు లింక్ పెడుతున్నారు చాలామంది. ఆ సినిమాలో కూడా హీరో అంతే. ఓ సాధారణ వ్యక్తిగా ఎంటరైన హీరో ఏకంగా మాఫియా సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడు. జీరో నుంచి హీరోగా ఎదుగుతాడు.

ఈ రెండు సిమిలారిటీస్ ను చూపిస్తూ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇక్కడ మరో పోలిక ఏంటంటే.. ‘కేజీఎఫ్’ టైపులో ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా సినిమానే.

లాంగ్ గ్యాప్ తర్వాత సెట్స్ పైకొచ్చింది “పుష్ప” సినిమా. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఈ సినిమా షూట్ మొదలైంది. తాజాగా హీరోయిన్ రష్మిక కూడా షెడ్యూల్ లో జాయిన్ అయింది.

Related Stories