క్లారిటీ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు?

Pawan Kalyan

ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 26వ చిత్రం. తదుపరి ఏ సినిమా విడుదలవుతుందో దాన్ని 27వ చిత్రంగా లేదా #PSPK27 అని పరిగణించాలి. కానీ ఇప్పటికీ, పవన్ కళ్యాణ్ 27వ చిత్రంగా ఏది విడుదల అవుతుంది, 28వ చిత్రంగా ఏది వస్తుంది, 29వ చిత్రం ఏది అవుతుంది అని విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దాంతో #PSPK27 అని రెండు సినిమాలకు, #PSPK28 అని రెండు సినిమాలకు వాడుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్ పై ఉన్నాయి. మరోటి మొదలు కావాలి.

రానాతో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. ఇది మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనం కోషియం’ సినిమాకి రీమేక్. ఇది రీమేక్, పైగా గ్రాఫిక్స్ హంగామా అవసరం లేని సింపుల్ మూవీ. సో, తొందర్లో షూటింగ్ పూర్తి చేసుకొని, ముందుగా విడుదల కాబోయేది ఇదే.

‘హరి హర వీరమల్లు’…. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం. పాన్ ఇండియా మూవీ. గ్రాఫిక్స్, సెట్స్… పెద్ద హంగామా ఉంది. ఈ సినిమాని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదలవుతుంది అనేది పక్కన పెడితే, ఈ రెండూ 27, 28 చిత్రాలుగా ఉంటాయి.

ఇంకా షూటింగ్ మొదలు కానీ హరీష్ శంకర్ సినిమాని #PSPK29గా చూడాలి. కానీ, మేకర్స్ ఇంకా దానికి #PSPK28 అనే వాడుకోవడం విచిత్రం. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు రకరకాల నంబర్లతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ కన్ఫ్యూజ్ చెయ్యడం ఎందుకు?

Advertisement
 

More

Related Stories