కరోనా వచ్చింది కానీ సేఫ్

“సీరియల్ నటి నవ్వకు కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఆమెను ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఇక ఆమె సీరియల్స్ కు దూరమైనట్టే.”

గడిచిన 24 గంటలుగా సీరియల్ నటి నవ్యపై వస్తున్న రూమర్స్ ఇవి. తనపై ఇంత ఘోరంగా ప్రచారం జరగడంతో నవ్య నేరుగా సీన్ లోకి వచ్చింది. తనకు కరోనా సోకిన మాట వాస్తవమేనని చెప్పిన నవ్య.. మిగతా ప్రచారమంతా అబద్ధమంటూ క్లారిటీ ఇచ్చింది.

కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయిందట నవ్య. మందులు వాడుతూనే, రెసిస్టెన్స్ పవర్ పెంచే మంచి ఆహారం తీసుకుంటోందట. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి కోలుకొని సెట్స్ పైకి వస్తానని చెబుతోంది నవ్య.

తన హెల్త్ కండిషన్ పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్య కాలంలో తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా ఆందోళన చెందకుండా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతోంది.

Related Stories