మెగా ఫ్యామిలీలో కరోనా కల్లోలం

Acharya

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం పెద్దది. సిస్టర్స్, తమ్ముళ్లు, వారి పిల్లలు, కూతుళ్లు, అల్లుళ్ళు, మనవళ్లు, మనవరాళ్లతో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఐతే, గతేడాది కరోనా వచ్చినప్పటి నుంచి చిరంజీవి ఇంట్లో చాలా మార్పులు జరిగాయి. ఇంట్లో కరోనా ప్రోటోకాల్ ని పాటిస్తూ వస్తున్నారు. అయినా.. వారిని కరోనా వెంటాడుతూనే ఉంది.

మొదటి లాక్డౌన్లో చిరంజీవి ఇంట్లో పని చేసే వారికి కరోనా వచ్చింది. ఇక గత కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ కి కరోనా వచ్చింది. ఐతే, చరణ్ త్వరగా కోలుకున్నారు.

రెండో వేవ్ లో మాత్రం కుటుంబ సభ్యులతో పాటు పనిచేసే సిబ్బందికి కూడా కరోనా సోకింది. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ వానిటీ వ్యాన్ నడిపే డ్రైవర్ కరోనాతో మరణించారు. దాంతో మెగా ఫ్యామిలీ మొత్తంగా షాక్ లో ఉంది. రామ్ చరణ్ పూర్తిగా ఐసోలేషన్ లోకి వెళ్లారు.

ఇక మెగా కుటుంబంలో ఇటీవలే పవన్ కళ్యాణ్ కి కరోనా వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కోలుకున్నారు. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తాజాగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు కరొనాతో.

More

Related Stories