మారుతోన్న కథ, స్క్రీన్ ప్లే

Movie Shootings

చిన్న సినిమా మేకర్స్ కు విషయం అర్థమైపోయింది. కరోనా లాక్ డౌన్ ప్రభావంతో తమ సినిమా ఏ మేరకు బిజినెస్ చేస్తుంది.. అసలు థియేటర్లు దొరుకుతాయా దొరకవా.. దొరికినా బిజినెస్ అవుతుందా అవ్వదా అనే విషయాలపై ఇప్పటికే అంతా ఓ అవగాహనకు వచ్చేశారు. దీంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న తమ సినిమాల్ని ఓటీటీకి తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేయడం మొదలుపెట్టారు.

మొన్నటివరకు సెన్సార్ ను దృష్టిలో పెట్టుకొని తమ సినిమా కథలు రాసుకున్న మేకర్స్, ఇప్పుడు ఓటీటీ కోసం తమ సినిమాల్లో లిప్ కిస్సులు, బూతు డైలాగ్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఆల్రెడీ ఎంపిక చేసిన కొంతమంది నటీనటుల్ని తప్పించి, వాళ్ల స్థానంలో ఓటీటీకి రీచ్ అయ్యే సోషల్ మీడియా సెలబ్రిటీలు, కాస్త హాట్ గా ఉండే ముద్దుగుమ్మల్ని తీసుకుంటున్నారు.

వీటితో పాటు లాక్ డౌన్ తో మరో పెద్ద మార్పు కూడా చోటుచేసుకుంది. చిన్న సినిమా నిర్మాతలంతా ఇప్పుడు తమ సినిమాల్ని కత్తిరించే పని పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్నఫలంగా 2 లాభాలు. ఒకటి ఓటీటీ ట్రెండ్ కు తగ్గట్టు 2 గంటల్లోపే సినిమా రెడీ అయిపోతుంది. రెండోది ఆ మేరకు ప్రొడక్షన్ ఖర్చు నిర్మాతకు బాగా తగ్గుతుంది.

ఇలా కరోనా వల్ల మూవీ మేకింగ్, మార్కెటింగ్ లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇంకెన్ని మార్పులకు లోనవుతుందో చూడాలి.

Related Stories