మరోసారి కరోనా బారిన బాలీవుడ్

కరోనా దెబ్బకు గతంలో బాలీవుడ్ విలవిల్లాడిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ నుంచి చిన్న నటుడి వరకు చాలామంది కరోనా బారిన పడ్డారు. బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలా కరోనా నుంచి తొందరగానే కోలుకున్న బాలీవుడ్, ఇప్పుడు మరోసారి కరోనా ధాటికి విలవిల్లాడుతోంది.

అవును.. బాలీవుడ్ లో వరుసగా ప్రముఖులంతా కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికిమొన్న అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. కాన్స్ చిత్రోత్సవానికి సైతం వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత కత్రినాకైఫ్, ఆదిత్యరాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి చాలామంది నటీనటులు కరోనా బారిన పడ్డారు.

ఆమధ్య దర్శకనిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి హాజరైన దాదాపు 55 మందికి కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. ఓవైపు ఈ వార్తలు ఇలా కొనసాగుతున్న వేళ.. షారూక్ ఖాన్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన నటించాల్సిన జవాన్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

ఇలా బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరే కరోనా బారిన పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఈ మహమ్మారి బారిన పడతారో అనే భయం బాలీవుడ్ సర్కిల్స్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఎవ్వరూ పార్టీలు చేసుకోవడం లేదు. 

 

More

Related Stories