కొత్త కరోనా, మళ్ళీ సినిమాలకే దెబ్బ!

Sarkaru Vaari Paata

బ్రిటన్ లో కరోనా వైరస్ మ్యూటేషన్ జరిగింది. అక్కడ ఈ కొత్త రకం కరోనా వైరస్ జనాల్ని వణికిస్తోంది. ఆల్రెడీ బ్రిటన్ నుంచి ఇండియాకి విమాన రాకపోకలను మన ప్రభుత్వం రద్దు చేసింది. డిసెంబర్ 31 వరకు అంతే. యూరోప్ లో కరోనా విజృంభిస్తోంది. అమెరికా పరిస్థితి గుడ్డిలో మెల్ల.

ఒకవైపు, వ్యాక్సిన్ వస్తోంది, వచ్చేసింది అన్న వార్తలు… ఇంకోవైపు ఇది. దాంతో మళ్ళీ సినిమా పరిశ్రమ ఇంకొన్నాళ్ళు సంక్షోభంలో కూరుకుపోవడం గ్యారెంటీ.

మహేష్ బాబు “సర్కారు వారి పాట”, పూరి “ఫైటర్” సినిమాలు అమెరికాలో షూటింగ్ జరుపుకోవాలి. వాటి షెడ్యూల్స్ మళ్ళీ తారుమారు అవడం పక్కా. అలాగే, “ఆర్.ఆర్.ఆర్” సినిమాకి సంబంధించి చిన్న వర్క్ యూరోప్ లో తీద్దామనుకుంటున్నారు రాజమౌళి. బహుశా ఇప్పుడు డ్రాప్ అవ్వొచ్చు.

More

Related Stories