చైతూ-సమంత కలలకు కరోనా బ్రేక్

Naga Chaitanya and Samantha

కెరీర్ విషయంలోనే కాదు జీవితంలో కూడా చాలా ప్లానింగ్ తో ఉంటారు నాగచైతన్య, సమంత. ఇద్దరూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో త్వరలోనే ప్రొడక్షన్ హౌజ్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే అంతకంటే ముందు సొంత డబ్బుతో చైతూ-సమంత ఓ భారీ విల్లా ప్లాన్ చేశారు. కానీ కరోనా వచ్చి వాళ్ల ఆశలకు గండికొట్టింది.

గోవాలోని మంచి బీచ్ వ్యూ పాయింట్ లో ల్యాండ్ తీసుకున్నారు సమంత-నాగచైతన్య. అక్కడే ఓ విల్లా ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి విల్లా కనస్ట్రక్షన్ మొదలయ్యేది. కానీ కరోనా రావడంతో ఈ జంట ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. ఎంతలా అంటే అసలు గోవాలో విల్లా కడదామా వద్దా అనే ఆలోచనలో పడిపోయింది ఈ జంట.

నాగచైతన్య, సమంత ఇద్దరికీ గోవా అంటే చాలా ఇష్టం. ఎంతిష్టమంటే వీళ్లు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. అందుకే ఆ ప్రాంతంలో విల్లా ప్లాన్ చేశారు. ప్రతి వీకెండ్ కాకపోయినా, కనీసం నెలకు ఒకసారైనా ఆ విల్లాలో స్టే చేయాలనేది వాళ్ల ప్లాన్. కానీ కరోనా రాకతో ఈ జంట తన ఆలోచనను మార్చుకున్నట్టు కనిపిస్తోంది.

Related Stories