
కరోనా వల్ల ఏర్పడ్డ సంక్షోభం టాలీవుడ్ ని అతలాకుతలం చేస్తోంది. 2020లో, 2021లో దెబ్బ తింది చిత్రసీమ. 2022లో కూడా అదే సీన్. రిలీజ్ కి రెడీగా పెట్టుకున్న సినిమా నిర్మాతల బ్యాంకు బాలన్స్ మైనస్ లో పడింది.
సంక్రాంతి సినిమాల సీజన్ ఆగిపోవడం ఒకటే సమస్య కాదు. మొత్తం అన్ని సినిమాల విడుదల కూడా కంగాళీగా మారుతోంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు సమ్మర్ కి మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా కూడా వాయిదా పడేలా ఉంది.
“ఆర్ ఆర్ ఆర్”, “రాధే శ్యామ్”లకి కూడా మంచి డేట్ దొరకాలి. “ఆర్ ఆర్ ఆర్”, “రాధే శ్యామ్”, “ఆచార్య”… ఈ మూడూ రెండేళ్లుగా వరుసగా వాయిదా జపం చేస్తూ వస్తున్నాయి.
మరోవైపు, సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతోంది. లక్ష్మి మంచు, మహేష్ బాబు తాజా కరోనా బాధితులు.