కాస్ట్యూమ్ డిజైన‌ర్ హీరోగా ప‌చ్చీస్

మ‌‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగార్జున‌ సహా పలువురు సెలబ్రిటీస్ కి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా పనిచేసిన రామ్స్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రం… ‘ప‌చ్చీస్’. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్. శ్వేతా వ‌ర్మ హీరోయిన్‌ గా నటిస్తోంది. కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

‘ప‌చ్చీస్’ టైటిల్ లోగో, ఫ‌స్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున ఆవిష్క‌రించారు.

“టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ బాగున్నాయి. రామ్స్ నాకు ప‌దేళ్ల నుంచీ తెలుసు. నా ‘ర‌గ‌డ’ చిత్రానికి ప‌నిచేశాడు. క‌చ్చితంగా ఇది అత‌నికి స‌క్సెస్ నిస్తుంద‌ని నాకు తెలుసు. డైరెక్ట‌ర్ శ్రీ‌కృష్ణ‌కు మంచి పేరు, విజ‌యం ద‌క్కాల‌ని ఆశిస్తున్నాను” అన్నారు నాగార్జున.

More

Related Stories