“భీమవరం బుల్లోడు”, “గరం” వంటి సినిమాల్లో నటించిన ఎస్తేర్ తన భర్త నుంచి విడాకులు పొందింది. పెళ్లైన ఆర్నెల్లకే ఎస్తేర్ భర్త నుంచి విడిపోయింది. ఎస్తేర్, ఆమె భర్థ నోయెల్ ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. కోర్టు వీరికి డివోర్స్ గ్రాంట్ చేసింది. దాంతో ఇటు ఎస్తేర్, అటు నోయెల్… ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తాము విడిపోయినట్లు రాసుకున్నారు.
నోయెల్ ప్రముఖ సింగర్. నటుడు కూడా. నిన్న తమకు కోర్టు ద్వారా విడాకులు మంజూరైన విషయాన్ని హీరోయిన్ ఎస్తేర్ బయటపెట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని.. తమ ఇద్దరి పరిస్థితిని అంతా అర్థం చేసుకోవాలని కోరింది.
గతేడాది జనవరిలో ఎస్తేర్-నోయెల్ పెళ్లి చేసుకున్నారు. రాజమౌళి దంపతులతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే పెళ్లయిన కొన్ని రోజులకే తామిద్దరం విడిపోయామని ఎస్తేర్ ప్రకటించింది. అప్పట్నుంచి వేర్వేరుగా ఉంటున్న తామిద్దరం, గతేడాది జూన్ లో విడాకులకు అప్లై చేశామని, ఇప్పుడు కోర్టు మంజూరు చేసిందని తెలిపింది.
I am Officially Divorced. Wishing Ester Noronha a great new life ahead! God bless! pic.twitter.com/7vvx84DUge
తెలుగులో “1000 అబద్ధాలు” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్. తర్వాత “భీమవరం బుల్లోడు”, “జయజానకి నాయక” లాంటి సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలు చేయడం లేదు.