మరికొన్ని రోజులు జైలులోనే రియా

Rhea

ఆల్రెడీ రియా చక్రబొర్తి రిమాండ్ లో ఉంది. ఆమెను ముంబయిలోని బైకుల్ల జైలులో ఉంచారు. ముంబయిలో ఉన్న ఏకైక మహిళా జైలు ఇదే. అయితే ఆమెకు వెంటనే బెయిల్ వస్తుందని అంతా ఊహించారు. కానీ అలాంటివేం జరగలేదు.

ఈనెల 22 వరకు రియాను రిమాండ్ కు అప్పగిస్తూ ముంబయి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీన్ని స్పెషల్ కోర్టులో సవాల్ చేసింది రియా. ఈరోజు విచారణ జరిపిన స్పెషల్ కోర్టు.. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. దీంతో రియా మరికొన్నాళ్లు జైలులోనే గడపాల్సిన పరిస్థితి.

ఇప్పుడు రియా ముందున్న ఆప్షన్ హైకోర్టు. ఈ మేరకు ఆమె లాయర్ శరవేగంగా ప్రయత్నాలు ప్రారంభించారు. రియా బెయిల్ కు సంబంధించి రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. అది ఎప్పటికి హియరింగ్ కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి.

ఎందుకంటే రెండో శనివారం, ఆదివారం వస్తున్నాయి. తిరిగి సోమవారమే కోర్టు తెరుచుకుంటుంది. ఆ రోజున బెయిల్ పిటిషన్ టేబుల్ పైకి వచ్చినా కోర్టు కేవలం వాదనలు మాత్రమే వింటుంది. వెంటనే ఆదేశాలు ఇవ్వదు. ఈ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అన్నీ లెక్కలోకి తీసుకుంటే రియా మరో 4 రోజులు జైలు జీవితం గడపాల్సిందే. ఈలోగా ఓ సెక్షన్ జాతీయ మీడియాలో రియాపై ఇంకెన్ని ఊహాగానాలు చెలరేగుతాయో చూడాలి.

Related Stories