
నటి, ఎంపీ నవనీత్ కౌర్ కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. ఐతే పరిస్థితి కొంత విషమించడంతో ఆమెని ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ముంబైకి తరలించారు. అమరావతిలోని తన ఇంటివద్దే చికిత్స పొందుతోన్న నవనీత్ పరిస్థితి విషమించింది. దాంతో హుటాహుటిన ముంబైకి తరలించామని ఆమె భర్త రవి రానా చెప్పారు.
శీను వాసంతి లక్ష్మి, రణం, యమదొంగ, రూంమేట్స్ వంటి తెలుగు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ మొన్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఏ పార్టీ అండ లేకుండా సొంత చరిష్మాతో గెలవడం విశేషం. ఆమె భర్త కూడా రాజకీయ నాయకుడే. వీరికి ఒక కూతురు.
34 ఏళ్ల నవనీత్ కౌర్ …ఎంపీగా కూడా ఇప్పటికే పార్లమెంట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహారాష్ట్రలో కోవిడ్ వ్యాధి విలయ తాండవం చేస్తోంది. ఐతే, ముంబైలో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఇంకా అదుపులోకి రాలేదు.