ముగ్గురి భామలకి హిట్ దక్కింది

టబు, కృతి సనన్, కరీనా కపూర్…. ముగ్గురు కలిసి నటించిన చిత్రం… క్రూ. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఇటీవల పేరొందిన బాలీవుడ్ హీరోల సినిమాలకు కూడా సరైన ఓపెనింగ్ రావడం లేదు. అలాంటిది ఈ సినిమా భారీ ఓపెనింగ్ సంపాదించుకోవడం విశేషం.

ఈ సినిమా మొదటి మూడు రోజులకు గాను ఇండియాలో 38 కోట్ల గ్రాస్ పొందింది. విదేశాల్లో మరో 20 కోట్లు సాధించింది. ఓవరాల్ గా మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 58 కోట్లు కొల్లగొట్టింది.

ఇందులో హీరోలు ఎవరూ లేరు. ఈ ముగ్గురు భామలే ప్రధాన కథానాయికలు. ఇది ఒక థ్రిల్లర్. ముగ్గురూ విమాన సిబ్బందిగా నటించారు.

కరీనా కపూర్, టబు సీనియర్ హీరోయిన్లు కాగా కృతి సనన్ యంగ్ హీరోయిన్. ట్రైలర్ జనాలను అట్రాక్ట్ చెయ్యడంతో మంచి ఓపెనింగ్ దక్కింది. సినిమాకి రివ్యూస్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. సో ఓవరాల్ గా చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ల ప్రధాన చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్ దక్కింది.

Advertisement
 

More

Related Stories