క్రిటిక్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత

Gudipudi Srihari

ప్రముఖ సినీవిమర్శకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. ఆయనకి 88 ఏళ్ళు. సితార, ఈనాడు, హిందూ, ఫిలింఫేర్ వంటి పత్రికలకు ఆయన సమీక్షలు రాశారు. ఒకప్పుడు ఆయన రివ్యూస్ కి చాలా క్రేజ్ ఉండేది. తెలుగు సినిమా విమర్శకుల్లో ఆయనది ప్రత్యేక స్థానం.

ఎందరో సినిమా నటులు, దర్శకులు ఆయనకి అభిమానులు. ఆయన సమీక్షల కోసం వేచి చూసేవారు.

“పాత్రికేయ రంగంలో… ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన శ్రీ గుడిపూడి శ్రీహరి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి గారు రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపేవి. శ్రీ గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలెబ్రిటీలు ఘన నివాళులు అర్పించారు.

మెగాస్టార్ చిరంజీవి: “గుడిపూడి శ్రీహరి గారు ఓ నిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీ విమర్శకుడు. ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు నటుడిగా నన్ను, నేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోడానికి ఎంతో ఉపకరించాయి. ఆయన మరణం సినీ పాత్రికేయరంగానికి తీరనిలోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను.”

Advertisement
 

More

Related Stories