10 నిమిషాలకో ట్విస్ట్: నాగ చైతన్య

Custody

నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా వచ్చేవారం విడుదల కానుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తీసిన ఈ సినిమా థిల్లర్. ఈ సినిమాలో నాగ చైతన్య ఒక కానిస్టేబుల్ గా నటించాడు.

“ఒ క మామూలు కానిస్టేబుల్ చేతిలో నిజం అనే ఆయుధం వుంటే అతను ఎంత దూరం వెళ్తాడనే పాయింట్ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. కాకపోతే నన్నే ఈ కథకు అనుకున్నారు అని అడిగాను ఆయన్ని. శేఖర్ కమ్ముల తీసిన “లవ్ స్టొరీ”లో నా నటన నచ్చిందని, ఈ పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని చెప్పారు,”అని అన్నారు నాగ చైతన్య.

“నాకు ఎప్పటి నుంచో తమిళ్ లో సినిమా చేయాలనే ఉండేది. వెంకట్ ప్రభు గారితో అక్కడ లాంచ్ కావడం, ఆయన ఇక్కడకి పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది. వెంకట్ ప్రభుగారికి అద్భుతమైన స్క్రీన్ ప్లే టెక్నిక్ వుంటుంది. కథ విన్నప్పుడు ఆయన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది,” అని చెప్పారు నాగ చైతన్య.

“ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త లేయర్ రివిల్ అవుతూ వుంటుంది. అదే ఈ సినిమాలో గమ్మత్తు,” అన్నారు చైతన్య.

“ఈ సినిమాలో హీరో విలన్ ని కాపాడుతాడు. అదే కొత్తదనం,” అని అన్నారు దర్శకుడు వెంకట్ ప్రభు.

 

More

Related Stories