రాజేష్ టచ్‌రివర్ ‘దహిణి’

ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన కొత్త సినిమా ‘దహిణి’. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించారు. తన్నిష్ఠ ఛటర్జీ హీరోయిన్ గా నటించింది. సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు.

రాజేష్ సినిమాలు ఎక్కువగా ఫిలిం ఫెస్టివల్స్ కి సెలెక్ట్ అవుతుంటాయి. ఈ సినిమాకి కూడా ఆ గౌరవం దక్కింది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ‘దహిణి’ ఎంపిక అయ్యింది. ఇంతకుముందు పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డుని పొందింది ‘దహిణి’.

వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీసే రాజేష్ టచ్ రివర్ ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లాలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ‘దహిణి’ చిత్రాన్ని తెరకెక్కించారు. పలు దేశాలను పట్టి పీడిస్తున్న ‘విచ్ హంటింగ్’ సమస్యను వెలుగులోకి తీసుకు రావాలని ‘దహిణి’ సినిమాను రూపొందించాను అని అంటున్నారు ఆయన.

“ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను కొంత మంది పాటిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా” అని అన్నారు నిర్మాతల్లో ఒకరైన సునీత కృష్ణన్.

Advertisement
 

More

Related Stories