ఇంకా చాలా నేర్చుకోవాలి: దక్షా

రవితేజ నటించిన కొత్త చిత్రం… ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు దక్షా నాగర్కర్.

“దర్శకుడు సుధీర్ వర్మ తీసే విధానం నచ్చుతుంది. ఇక రవితేజ గారి సినిమాలో భాగం అవ్వడం అంటే సూపర్ కదా. అందుకే ఐదుగురు హీరోయిన్లు ఉన్నా ‘రావణాసుర’ ఒప్పుకున్నాను,” అని చెప్తోంది దక్షా నాగర్కర్.

ఈ భామకి గ్లామర్ గాళ్ ఇమేజ్ ఉంది. కానీ, ఇందులో నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేసిందట.

“‘హోరాహోరి’లో మానసిక సమస్యలున్న అమ్మాయిగా నటించాను. “హుషారు”లో దిల్ చహతహే తరహ పాత్ర చేశాను. “జాంబిరెడ్డి తెలుగులో మొదటి జాంబి ఫిల్మ్. “రావణాసుర”లో నా పాత్ర చూసి సర్ ప్రైజ్ అవుతారు అని చెప్పగలను,” అని చెప్పింది.

“రవితేజ పెద్ద హీరో అయినా ఆ దర్పం చూపించరసలు. సెట్స్ లో చాలా సరదా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవం,” అని రవితేజని పొగిడింది ఈ భామ.

నటిగా ఇంకా తన ప్రయాణం చాలా ఉంది అని అంటోంది. “చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. జర్నీ ఇప్పుడే వేగం అందుకొంది. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇటివలే ఒక యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను,” అని చెప్పింది దక్షా.

Advertisement
 

More

Related Stories