
అ, జాంబీరెడ్డి, కల్కి అనే మూడు సినిమాలు తీసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ నాలుగో చిత్రంగా ‘హను మాన్’ అనే ఒక సూపర్ హీరో సినిమా తీస్తున్నారు. ఇక ఇప్పుడు నిర్మాత దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా ‘అధిర’ అనే సినిమా ప్రకటించారు. ఇది అతనికి ఇదో చిత్రం. నిర్మాత దానయ్య కొడుకు కళ్యాణ్ కి ఇది మొదటి చిత్రం.
ప్రశాంత్ వర్మ తీసిన ‘హను మాన్’ అనే సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ దానికి కొనసాగింపుగానే “Prasanth Varma Cinematic Universe” అనే కాన్సెప్ట్ తెచ్చారు. ఈ సినిమాలో అధిర పాత్రలో కళ్యాణ్ కనిపిస్తాడు.
కళ్యాణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో పాలు పంచుకున్నాడు. నిర్మాణం నుంచి యాక్టింగ్ వైపు వస్తున్నాడు. హీరో కావాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికి సెట్ అయింది.
ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ ఎవరు వంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు.